టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లో జూనియర్ యన్టీఆర్ ఒకరు. అతడి చిత్రం ‘అశోక్’ అంతగా ఆడకపోయినా.. అందులోని గోల గోల పాట మాత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా రచ్చ రచ్చ చేస్తోంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అశోక్ చిత్రం 2006లో విడుదలైంది. మణిశర్మ సంగీతం కూర్చిన ఆ సినిమాలోని పాటలన్నీ అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా అందులోని గోల గోల అనే పాట జపనీస్ యువతను వెర్రెత్తిస్తోంది.

యన్టీఆర్ ,సమీరా రెడ్డి ఆడిపాడిన ఆ పాటకు ఇప్పుడు జపనీస్‌లోని ఓ యవజంట అచ్చంగా అలాగే డ్యాన్స్  చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరలవుతోంది. జపాన్‌లో మన దక్షిణాది హీరో రజనీకాంత్‌కి ఎప్పట్నుంచో అక్కడ అభిమానులు ఉన్నారు. ఆ మధ్య బ‚హబలి బృందం కూడా జపాన్‌లో సందడి చేసింది. ఈ నేపథ్యంలో యన్టీఆర్ కూడా జపనీస్ కుర్రకారుకు అభిమాన హీరో అవడం విశేషంగా మారింది.

వీడియో సాంగ్ ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.facebook.com/watch/?v=195158981913304

Leave a comment

error: Content is protected !!