Janvi Kapoor : ప్రతి హీరోయిన్ కు ఒకేలాంటి ప్రశ్న ఎదురవుతుంది – “మీకు ఎలాంటి భర్త కావాలి?”. ఇప్పుడు ఆ ప్రశ్న హీరోయిన్ జాన్వీ కపూర్ ను కూడా వెంటాడింది. తాజాగా “మిస్టర్ అండ్ మిస్సెస్ మహి” చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న జాన్వీ, సినిమాలో మిస్సెస్ మహిగా నటించిన తన నిజజీవితంలో తన మిస్టర్ లో ఏ లక్షణాలు కోరుకుంటుందో చెప్పింది. ఆమె సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది.
“నా కాబోయే భర్త నా కలలను తన కలలుగా మార్చుకోవాలి. నాకు మద్దతు ఇవ్వాలి. నా కోసం బలంగా నిలబడాలి. నాకు ఆనందం ఇవ్వాలి. నవ్వించాలి. నేను ఏడ్చినప్పుడు కూడా నాతోనే ఉండాలి.” అని చెప్పగానే, జర్నలిస్టులు వెంటనే “అలాంటి వ్యక్తి మీకు ఇప్పటికే దొరికాడు కదా?” అని అడిగారు. దానికి జాన్వీ నవ్వుతూ కన్ను కొట్టింది.
జాన్వీ కొంతకాలంగా తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది. వీరు పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే జర్నలిస్టులు ఆమెకు ఇప్పటికే అలాంటి వ్యక్తి దొరికాడని అన్నారు.