Janvi kapoor : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో బిజీ షెడ్యూల్ తో తలమునకలై ఉంది. ‘దేవర’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తూనే, రామ్ చరణ్ తదుపరి సినిమాలోనూ నటించేందుకు సిద్ధమయింది. అయితే తాజా సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలొస్తున్నాయి . ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. ఈ వార్త వినగానే జాన్వీ అభిమానులు కంగారు చెందారు. అయితే, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ త్వరగా కోలుకొని, మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఆశిద్దాం.