కామెడీ అండ్ క్లాసిక్ యాక్టర్ అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ సినిమా మే 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో జామీ లీవర్ కీలక పాత్ర పోషిస్తోంది . ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. ఇందులో ఆమె అల్లరి నరేష్ వదినగా కనిపించనుందని చిత్రంలో ఆమెది కీలక పాత్ర అని సమాచారం.

అల్లరి నరేష్‌తో జామీ సరదా సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జామీ లివర్.. లెజెండరీ నటుడు జానీ లివర్ కుమార్తె . ఆమె బాలీవుడ్‌లో మంచి పాత్రలు పోషించింది. మరి ఈ సినిమాతో జామీ తన తెలుగు కెరీర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!