మూవీ రివ్యూ :
నటీనటులు: రజినీకాంత్-రమ్యకృష్ణ-వినాయకన్-వసంత్ రవి-వీటీవీ గణేష్-యోగిబాబు-మోహన్ లాల్-సునీల్-శివరాజ్ కుమార్-తమన్నా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్
నిర్మాత: కళానిధి మారన్
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

రజినీకాంత్ అంటే మాస్‌ మంత్రం. ఊరమాస్‌ కమర్షియల్‌ ఇమేజ్‌కు స్టైలిష్‌ రూపం రజినీకాంత్‌. అలాంటి రజినీకాంత్ కూడా సక్సెస్‌ కోసం ఎదరుచూడాల్సి వచ్చింది. గతంలో వచ్చిన కబాలి, కాలా, అన్నాత్తే లాంటి సినిమాలు సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ని నిరాశపర్చాయి. ఖచ్చితంగా రజినీకాంత్‌కు హిట్‌ పడాల్సిన టైమ్‌లో వచ్చింది జైలర్. మరి జైలర్‌ హిట్టా ఫట్టా ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
ముత్తు (రజినీకాంత్‌) రిటైర్డ్ పోలీసాఫీసర్‌. ఫ్యామిలీతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటి సాధారణ జైలర్… ఎంత పవర్‌ఫుల్‌ అనేది రివేంజ్‌ డ్రామాలో తెలుస్తుంది. పోలీస్‌ ఉద్యోగంలో ఉన్న తన కొడుకు (వసంత్‌రవి) ఓ మాఫియా చేతిలో మరణించడంతో.. ముత్తు అందుకు కారణమైన ఒక్కొక్కరిని వేటాడి చంపేసే క్రమంలో సాధారణ జైలర్‌ ఎంత పవర్‌ఫుల్‌ అనేది తెలుస్తుంది. తన కొడుకు చనిపోలేదని బంధీగా ఉన్నాడని తెలుసుకున్న ముత్తు అతన్ని విడిపించడానికి అతిపెద్ద సవాల్‌ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సవాల్‌ని ఛేదించే క్రమాన్ని తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
విజిల్స్‌ వేయించే స్టైల్స్‌ మేనరిజమ్స్‌, క్లాప్స్‌ కొట్టించే యాక్షన్‌ సీక్వెన్స్‌, థ్రిల్లిచ్చే స్క్రీన్‌ప్లే ఇందులో రజినీకాంత్‌ని కరెక్ట్‌ గా ప్రొజెక్ట్ చేసే కథ ఉంటే రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం.. ఈమధ్యకాలంలో ఇలాంటి కథ పడక.. చేసిన ప్రయోగాలు రజినీకి సరిపడక వరుసఫ్లాపులు బాటన పడకతప్పలేదు రజినీకి. అయితే రజినీకి తగ్గ ఎలివేషన్లను, సూపర్‌స్టార్ ఇమేజ్‌ కి సరితూగే కథను సెట్‌ చేసి కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసాడు దర్శకుడు నెల్సన్. సాధారణ జైలర్‌గా మొదలై.. ఆసాధారణ వ్యక్తి గా సూపర్‌స్టార్‌ ఇమేజ్‌తో నెల్సన్‌ మేజిక్‌ చేసాడు. తనకలువాటైన కామెడీని, సూపర్‌స్టార్‌ తరహా మాస్ ఎలివేషన్లను సరిగ్గా బ్యాలెన్స్‌ చేస్తూ.. ఫస్టాఫ్ ను అలవోకగా సాగింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో విజిల్స్‌ వేయించాడు. ఇక్కడి నుంచే అసలు కథ స్టార్టవుతుంది. కానీ ఇక్కడి నుంచే నెల్సన్‌ తడబడటం కూడా స్టార్టయింది. కీలకమైన సెకండాఫ్‌ను సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడు. కానీ ప్రీ క్లైమాక్స్‌ నుంచి మళ్లీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కు తగ్గ మేజిక్‌ తో క్లైమాక్స్‌ వరకు వావ్ అనిపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో 72 ఏళ్ల రజినీని యంగ్‌ గా చూపించడంలో నెల్సన్‌.. యంగ్‌ పాత్రలో రజినీ మేనరిజమ్స్‌, అప్పీయరెన్స్‌కు విజిల్స్ వేయాల్సిందే. పవర్‌ ఫుల్ హీరోకు తగ్గట్టుగా విలన్‌ పాత్రను తీర్చిదిద్దకపోవడం మైనస్‌ అనిపిస్తుంది.

నటీనటులు :
సూపర్‌స్టార్‌కు ఇలాంటి రివేంజ్‌ డ్రామాలు, స్టైలిష్‌ ఎలివేషన్స్, పంచ్‌ డైలాగ్‌లు కొట్టిన పిండి. అయితే ఇంతకు ముందు చూసిన రజినీకి జైలర్‌ రజినీకి కాస్త డిఫరెన్స్‌ కనిపిస్తుంది. రజినీ స్టైల్స్‌ విషయంలో నెల్సన్‌ కొంత కంట్రోల్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రజినీ వన్‌మ్యాన్‌ షో జైలర్‌. నరసింహ లో రజినీకి ధీటుగా పోటాపోటీగా నటించిన రమ్యకృష్ణ ఇందులో గృహిణిగా పర్వాలేదనిపించుకుంది. సునీల్ తమన్నా లవ్‌ ట్రాక్‌ ఉన్నా లేనట్టే ఉంది. విలన్‌గా నటించిన వినాయకన్ బాగా నటించాడు. కమెడియన్‌ యోగిబాబుకు మంచి మార్కులు పడతాయి.

టెక్నిషియన్స్‌:
జైలర్‌లో రజినీకాంత్ హీరో అయితే.. టెక్నికల్ గా అనిరుధ్ రవిచందర్‌ మరో హీరో. జైలర్‌కు ప్రధాన బలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌. కథ వీక్‌ గా ఉన్నా రజినీ ప్రజెన్స్‌ ఊపు తెస్తే.. రజినీ ప్రజెన్స్‌ లేని చోట బలాన్నిచ్చింది అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే. ఇక విజయ్‌ కార్తీక్‌ కెమెరా పనితనం మేజిక్‌ చేసింది. రజినీ ఇమేజ్‌ ను ప్రొజెక్ట్ చేయడంలో చరిష్మాను వాడుకోవడంలో నెల్సన్‌ సక్సెస్‌ అయ్యాడు. రైటర్‌గా మాత్రం ఈ సినిమాతో కాస్త వీకయ్యాడనే చెప్పాలి.

బాటమ్‌ లైన్ : రజినీ ఈజ్‌ బ్యాక్

 

Leave a comment

error: Content is protected !!