Devakinandana Vasudeva : మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “దేవకీ నందన వాసుదేవ”. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. వారణాసి మానస కథానాయికగా నటిస్తుండగా, సోమినేని బాలకృష్ణ లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దివంగత నటుడు కృష్ణ జయంతి సందర్భంగా ఒక పాటను విడుదల చేసింది.

“జై బోలో కృష్ణ జన్మాష్టమి…” అంటూ సాగే ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. రఘురామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా, స్వరాగ్ కీర్తన్ గాత్రం ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్, కుటుంబ వినోదంతో పాటు ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చిత్రంగా రూపొందుతోంది. “హనుమాన్” ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.
“జై బోలో కృష్ణ…” పాట విజువల్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. యష్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించగా, అశోక్ గల్లా డ్యాన్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం యొక్క విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Leave a comment

error: Content is protected !!