Jagapathibabu : టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన నటులలో జగపతి బాబు ఒకరు. ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత విలన్‌గా, తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తన ప్రతి పాత్రలోనూ జీవం పోసి, ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. తన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు అప్పట్లో మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేవి. వరుస సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ సొంతం చేసుకున్నారు.

కొంతకాలం తర్వాత తన కెరీర్‌ను మరో కోణంలో మలచుకోవాలని నిర్ణయించుకొని, విలన్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఆయనకు ఎంతగానో కలిసివచ్చింది. విలన్ గా మారిన తరువాత ఆయనకు స్టార్ విలన్ గా గుర్తింపు లభించింది. ఇప్పుడు జగపతి బాబు రెండు చేతులా సంపాదిస్తూ, ఒక పక్క హీరోలకు ధీటుగా ఉండే పాత్రలను చేస్తూనే, మరో పక్క విలన్ గా సపోర్టివ్ రోల్స్ లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

జగపతి బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రతి ఫోటోకు తెలుగులో చమత్కారమైన క్యాప్షన్స్ రాసి అభిమానులను అలరిస్తారు. తన ఫ్యాన్స్‌తో ఎల్లవేళలా కనెక్ట్ అయి ఉంటారు. ఇటీవలే ఆయన బ్లాక్ డ్రస్, సిల్వర్ చైన్స్ వేసుకుని తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వయసు పెరిగే కొద్దీ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అది మీకు ఓకేనా? అంటూ క్యాప్షన్ రాశారు.

ఈ పోస్ట్‌కు అభిమానులు భారీ స్పందన తెలుపుతూ, ఆయన ఇప్పటికీ హీరోలాగానే ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం జగపతి బాబు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇంతటి వయసులో కూడా ఆయన కెరీర్ పీక్‌లో ఉండటం ఆశ్చర్యకరం. వయసు 60 దాటినా కూడా జగపతి బాబు ఇప్పటికీ యువకుడిలా ఉంటారు. తన ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతారు. ఈయనను చూసి చాలా మంది యువత ప్రేరణ పొందుతున్నారు.

Leave a comment

error: Content is protected !!