అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన చిత్రం “జగమెరిగిన సత్యం”, అచ్చ విజయ భాస్కర్ నిర్మాణంలో, తిరుపతి పాలే దర్శకత్వంలో రూపొందింది. హీరోగా అవినాష్ వర్మ, హీరోయిన్‌లుగా ఆద్య రెడ్డి, నీలిమ నటించిన ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన సందర్భంగా, మూవీ టీమ్ పాల్గొన్న ఈవెంట్‌లో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అని, నిర్మాత భాస్కర్ మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తూ, దర్శకుడు ఆశయం ఈ సినిమాతో నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. హీరో అవినాష్ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని, సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో జరిగే కథతో కొత్తగా స్లాగ్, ఎమోషనల్, సెంటిమెంటల్ అంశాలతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. దర్శకుడు తిరుపతి పాలే, తమపై నమ్మకం ఉంచి సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ట్రైలర్‌కి వచ్చిన స్పందన సినిమాకూ లభిస్తుందని, సురేష్ బొబ్బిలి సంగీతం, షోయబ్ కెమెరా వర్క్ సినిమాకు మరింత మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దర్శకుడు తిరుపతి ఎంతో కష్టపడ్డారని, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకమున్నట్లు పేర్కొన్నారు. నటీనటులుగా అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి తదితరులు నటించారు.

Leave a comment

error: Content is protected !!