కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. అయితే ఇంకొన్ని సినిమాలు మాత్రం సరికొత్త చరిత్ర లిఖించడానికే తెరకెక్కుతాయి. అలాంటి ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. 1990, మే 9న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ అండ్ మాసీ యాక్షన్ విత్ మెస్మరైజ్ డ్యాన్సెస్ , అతిలోక సుందరి శ్రీదేవి ముగ్ధమనోహర రూపం .. దర్శకేంద్రుడి అద్భుత టేకింగ్ .. అశ్వనీదత్ అనితరసాధ్యమైన నిర్మాణ విలువలు ఈ సినిమాను టాలీవుడ్ సినీ చరిత్రలోనే మరిచిపోలేని సినిమాగా మార్చాయి. ఇక ఈ సినిమాలో  సంగీత, కన్నడ ప్రభాకర్, తనికెళ్ళ భరణి, రామిరెడ్డి, అమ్రిష్ పురి, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి లాంటి రచయితల బృందం తీర్చిదిద్దిన సోషియో ఫాంటసీ స్టోరీ .. మాస్ జనానికి భలేగా ఎక్కేసింది. ఒక దేవకన్య భూలోక విహారానికొచ్చి.. తన ఉంగారాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం  ఆమె దగ్గర ఉంటేనే గానీ..  స్వర్గలోక ప్రవేశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉంగరాన్ని వెతుకుతూ.. భూలోకానికి వస్తుంది దేవకన్య. ఓ సామాన్య మానవుడికి ఆ ఉంగరం దొరికిందని తెలుసుకొని అతడ్ని మచ్చిక చేసుకొని ఉంగరాన్ని చేజిక్కించుకొని మళ్లీ స్వర్గలోకానికి వెళ్లిపోవాలని ఆమె ప్లాన్. ఇంతకీ ఆ ఉంగరం దొరికి ఆమె తిరిగి స్వర్గలోకం వెళ్లిపోతుందా లేదా అన్నదే మిగతా కథ. చిన్నపిల్లలు చదువుకొనే ఇలాంటి చందమామ కథని .. జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సందేహమే  లేకుండా.. చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు .  అంతేకాదు.. ఈ సినిమాను చిన్నపెద్దా తారతమ్యం లేకుండా.. విడుదల రోజున తుఫాన్ ను సైతం లెక్కచేయకుండా.. ఎగబడ్డారు జనం. ఇళయరాజా సంగీత సారధ్యంలోని అన్ని పాటల్ని .. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. దానికితోడు వేటూరి సాహిత్యం బంగారానికి తావి అబ్బినట్టుగా పెర్ఫెక్ట్ గా కుదిరి .. మ్యూజికల్ మ్యాజిక్ చేసింది.   30 ఏళ్ళు దాటినా ఆ సినిమా ఇప్పటికీ ఎంతో కొత్త గా అనిపిస్తుంది. దటీజ్ మెగాస్టార్ …

Leave a comment

error: Content is protected !!