బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘జాట్’ కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌తో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచింది. ఈ చిత్రంలోవినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్‌ను పర్యవేక్షించగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ 2025 వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.