ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథాచిత్రం 2, అభినేత్రి 2 చిత్రాలతో జనాన్ని బాగా భయపెట్టిన అందాల నందితా శ్వేత .. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో థ్రిల్ చేయబోతున్న చిత్రం ‘ఐపిసి 376. ఇంతకు ముందు టైటిల్ లుక్, టీజర్స్ తో ఆకట్టుకున్న సినిమా టీమ్ .. ఇటీవల చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ మూవీ అని ట్రైలర్ చూస్తే  అర్దమవుతోంది. ఇంత వరకూ తన గ్లామర్ తో ప్రేక్షకులకు అందాల ట్రీట్ ఇచ్చిన నందితా శ్వేత.. ఈ సినిమాలో యాక్షన్ క్వీన్ అవతారమెత్తింది. రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సిినిమాని యస్. ప్రభాకర్ నిర్మిస్తున్నారు. 

‘రేప్ చేస్తారు.. ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలని బ్రతకనివ్వరా రా” అంటూ నందిత శ్వేత చెప్పే డైలాగ్ ని బట్టి చూస్తే ఈ సినిమా మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాడే కథాంశమని తెలుస్తోంది. ఇక లైంగిక దాడులు అత్యాచారం నేరం చేసిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 376 ప్రకారం శిక్ష విధిస్తారు. టైటిల్ ని బట్టి చూసుకున్నా సినిమా నేపథ్యం అత్యాచార సంఘటన చుట్టూ సాగుతుందని అనుకోవచ్చు. అంతేకాకుండా ”మన చుట్టూ జరిగే అమానుషాలకి సైన్టిఫిక్ ఎక్సప్లనేషన్స్ ఉన్నాయి. దెయ్యాలు అనేవి అస్సలు లేవు” అంటూ హారర్ అంశాలను కూడా ఈ ట్రైలర్ లో జత చేశారు. ‘ఇంఫార్మర్ అన్ నోన్ అతనిచ్చిన మెసేజ్ అన్ నోన్ ఒక అన్ నోన్ కోసం ఇంత కష్టపడాలా చెప్పండి’ ‘చావు అనేది శత్రువులు తీర్మానించకూడదు.. ఆ దేవుడు తీర్మానించాలి’ అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈరోజు రిలీజైన ‘ఐపీసీ 376’ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ట్రైలర్ ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://bit.ly/2Zx23jN

 

Leave a comment

error: Content is protected !!