Ormax survey : తాజా ఓర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం, ప్రభాస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు. జూన్ నెలలో విడుదలైన ఈ జాబితాలో, ప్రభాస్ తన తాజా చిత్రం “కల్కి 2898 ఏడీ” భారీ విజయంతో ఈ ఘనత సాధించాడు. మే నెలలో కూడా అగ్రస్థానంలో నిలిచిన ప్రభాస్, ఈ జాబితాలో తన స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రెండో స్థానంలో నిలువగా, అల్లు అర్జున్, ఎన్టీఆర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. నాయికల జాబితాలో, ఆలియా భట్ అగ్రస్థానంలో ఉండగా, సమంత రుత్ ప్రభు, దీపికా పదుకొనే తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రభాస్ అత్యధిక ప్రజాదరణ ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన ఖాన్‌లు, కపూర్‌లు, రోషన్‌ల వంటి అగ్ర నటుల స్థానాన్ని ఆయన భర్తీ చేశారని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన “కల్కి 2898 ఏడీ” చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. 12.15 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడవడంతో, షారుక్ ఖాన్ “జవాన్” చిత్రం టిక్కెట్ల విక్రయాల రికార్డు ను వెనక్కి నెట్టింది.
కల్కి విజయం ప్రభాస్ అద్భుతమైన నటన, స్టార్ డమ్‌ను మరోసారి నిరూపించింది. ‘రాజాసాబ్, సలార్ 2, కల్కి 2989 ఏడి- 2’ వంటి రాబోయే చిత్రాలు ఈ స్థాయిని మరింత పెంచుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ ఖచ్చితంగా భారతీయ సినిమా చరిత్రలో ఒక శక్తిగా ఎదిగాడు. అతని అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులతో అవినాభావ సంబంధం అతనిని నిజంగానే నెం. 1 హీరోని చేశాయి.