Indian 2 : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, యంగ్ హీరో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన.. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన “ఇండియన్ 2” జూలై 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

సినిమా విడుదలకు ఇంకా  రెండు మిగిలి ఉండగా.. మేకర్స్ ఇండియన్ 2 4DX ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ చిత్రం ఐమాక్స్‌తో పాటు 4DXలో కూడా విడుదల కావడం ప్రేక్షకులకు విజువల్‌గా మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యస్.జే సూర్య, బాబీ సింహ విలన్స్ గా కనిపిస్తారు.

Leave a comment

error: Content is protected !!