కమల్ హాసన్ – శంకర్ క్రేజీ కాంబో మూవీ ‘ఇండియన్ 2’. 1996 నాటి విజిలెంట్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమాకిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే . అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో భారతీయుడుగా విడుదలై ఇక్కడా దుమ్మురేపేసింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా సీక్వెల్ అయిన.. ఇండియన్ 2 పైనే ఉంది. తెలుగులో భారతీయుడు 2 గా జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇంక ఈ సినిమా సంగీత ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా మొదటి సింగిల్ “పారా” ను మే 22న విడుదల చేయనున్నారు. ఇదే పాట తెలుగులో సౌరా పేరుతో వస్తోంది.  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ఈ భారీ చిత్రం రూపొందింది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇండియన్ ఫ్రాంచైజ్‌కు మూడో పార్ట్ కూడా ఉంటుంది. మూడో పార్ట్ ఇండియన్ 2 విడుదలయిన ఆరు నెలల తర్వాత విడుదలవుతుంది.

Leave a comment

error: Content is protected !!