Indian 2 : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం “ఇండియన్ 2” చిత్రం జూలై 12న విడుదల కాబోతోంది. తెలుగులో “భారతీయుడు 2” పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో లాంఛ్ ఈవెంట్ జూన్ 1వ తేదీన హైదరాబాద్ లోని నెహ్రూ స్టేడియం లో ఘనంగా జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్య అతిథులుగా హాజరవుతారో ఇంకా వెల్లడించలేదు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. “ఇండియన్ 2” చిత్రం 2018లో విడుదలైన “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!