Indian 2 :  లోకనాయకుడు కమల్ హాసన్ , భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ “ఇండియన్ 2”. ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘భారతీయుడు 2’ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ 1996 బ్లాక్ బస్టర్ “ఇండియన్”కి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

ఇంక అసలు విషయానికొస్తే.. ఇండియన్ 2 చిత్రం 3 గంటల (180 నిమిషాలు) రన్ టైమ్ తో రాబోతుండడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలలో రన్ టైమ్ ఒకటి కావడంతో, ఈ పొడవైన నిడివి చాలా అందరినీ  ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన “కల్కి 2898 AD” కూడా 3 గంటల పాటు సాగింది. అయితే, ప్రభాస్ నటించిన ఆ చిత్రం విభిన్నమైన కథాంశాన్ని కలిగి ఉండటం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

“ఇండియన్ 2” కథ అవినీతిని అంతం చేయడానికి ఒక వ్యక్తి చేసే పోరాటం గురించి. ఇంతకుముందు చాలా సార్లు చూసిన కథాంశం కావడంతో, ప్రేక్షకులను కట్టిపడేసేలా కథనం చాలా బలంగా ఉండాలి. ఈ విషయంలో శంకర్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!