Ilayaraja :  రీసెంట్ గా వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటి.  వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటేంటంటే..  లెజెండరీ హీరో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ హిట్‌లలో ఒకటైన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖలే అనే పాట ఈ సినిమాకి పెద్ద అసెట్.

అయితే ఇప్పుడు ఈ పాటపై ఆ పాట కంపోజర్ ఇళయరాజా ఆ సినిమా మేకర్స్ కు షాకిచ్చారు. తన అనుమతి లేకుండా పాటను సినిమాలో ఉపయోగించినందుకు తనకి రాయల్టీ చెల్లించాలని లీగల్ నోటీసులు పంపారు. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలోని ఒక పాట విషయంలోనూ ఇళయరాజా ఈ విధంగానే రియాక్ట్ అయ్యారు.

అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే గుణ సినిమాలోని పాటలను సొంతం చేసుకున్న ఆడియో కంపెనీ వారు ఆ పాటను మంజుమ్మల్ బాయ్స్‌కి అమ్మేశారు. వారు పాట హక్కులను వారి నుండి కొనుగోలు చేశారు. కాబట్టి ఈ విషయంలో తాము సేఫ్ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

Leave a comment

error: Content is protected !!