మూవీ టైటిల్: హంట్ (గన్స్ డోంట్ లైస్)
నటి నటులు: సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్ మేక, చిత్ర శుక్ల, రమణ గోపరాజు, రవి వర్మ, మంజుల, మోనికా రావ్ తది తరులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డీఓపీ: అరుళ్ విన్సట్
మ్యూజిక్ డైరెక్టర్: గిబ్రాన్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
ప్రొడ్యూజర్: వి ఆనంద ప్రసాద్
డైరెక్టర్: మహేష్ సూరపనేని

హీరో సుధీర్ బాబు కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ప్రజలను అలరించడానికి ప్రయత్నం చేసాడు. కాకపోతే, బాక్స్ ఆఫీస్ వద్ద బెడిసి కొట్టాయి. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా తర్వాత, “హంట్” అనే యాక్షన్ చిత్రంతో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సుధీర్ బాబు, తమిళ హీరో భరత్, శ్రీకాంత్ స్టార్ కాస్టింగ్ తో, భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందా లేదో తెలుసుకుందాం.

కథ: అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్ హత్యకి గుర్రవ్వుతాడు. ఆ కేస్ ని అర్జున్ ప్రసాద్ అనే నిజాయితీ గల పోలీసు అధికారికి అప్పగిస్తాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ ప్రసాద్‌కి యాక్సిడెంట్ జరగడంతో ముందు జరిగిన విషయాలన్ని మర్చిపోతాడు. ఆర్యన్ దేవ్ కేసును ఛేదించడానికి అర్జున్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురుకున్నాడు. అర్జున్ ఈ కేసు సాల్వ్ చేశాడా లేదా అనేది తెర మీద తెలుసుకోవాలిసిందే.

కధనం, విశ్లేషణ: హంట్ చిత్రం మలయాళ చిత్రం ముంబై పోలీస్‌కి రీమేక్‌గా కనిపించినప్పటికీ, ఆ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు. కానీ, చాలా ప్రశంసలు అందుకుంది. హంట్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చాలా బాగా రూపొందించబడినప్పటికీ, సినిమాలోని చాలా సన్నివేశాలు “ముంబయి పోలీస్” మలయాళ వెర్షన్‌లో ఉన్నట్టు గా ఉంటాయి.

దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు నచ్చే కొన్ని అంశాలను జోడించడానికి ప్రయత్నించాడు. సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ చాలా మంది ఇంతకముందెపుడు చూసి ఉండకపోవచ్చు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. హంట్ చిత్రం టెక్నికల్ గా బాగానే అనిపిస్తుంది. సినిమాలో పాటలకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. దర్శకుడు మహేష్ సూరపనేని ఇప్పటికే వేరే భాషలో చెప్పిన కథను చెప్పడానికి ప్రయత్నించాడు, అయితే ఇప్పుడున్న ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా కొన్ని మార్పులు చేసాడు. సినిమా మేకింగ్ లో తాను ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది. మొత్తంమీద, హంట్ చిత్రం యాక్షన్‌తో కూడిన వినోదాత్మక చిత్రం మరియు మీరు ఊహించని కొన్ని మలుపులుతో కొంచెం కొత్తగానే సాగుతుంది. సో, తప్పకుండ కుటుంబంతో చూడలిసిన సినిమా ఇంకెందుకు ఆలస్యం మీరు చూసి ఎంజాయ్ చేయండి.

నటి నటులు పెరఫామెన్స్: సుధీర్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో హాలివూడ్ హీరో లా చేసిన స్టంట్ లు అబ్బుర పరుస్తాయి. తమిళ హీరో భరత్ ఈ సినిమాకి ప్రధాన బలం, ప్రతి సీన్స్ లో ఎంతో ఇంటెన్స్ గా యాక్టింగ్ తో అలరించాడు. శ్రీకాంత్ యంగ్ లుక్స్ తో కనిపించడమే కాకుండా, సినిమాకి వెన్నుముక లా నిలిచారు. ఇకపోతే, చిత్ర శుక్ల, మోనికా, రమణ గోపరాజు, మంజుల స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నంత వరుకు పెర్ఫామెన్స్ తో బాగానే ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ మహేష్ సూరపనేని యాక్షన్ – ఎమోషన్స్ తో పాటు టేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండ బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారనే చెప్పాలి. కాకపోతే, అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీత గా ఉన్నాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి పని తీరు బాగుంది. డీఓపీ అరుళ్ విన్సట్ విజ్యువల్స్ అద్భుతంగా ఇచ్చారు. గిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎస్సెట్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ సినిమాకి హై లైట్ బీజీఎమ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండ రిచ్ గా ఉన్నాయి.

రేటింగ్: 3/5
 బాటమ్ లైన్ : హాలివుడ్ విజ్యువల్స్ తలపించిన “హంట్” 

Review By: Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!