Vijay 69 : తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మెగాస్టార్, తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. తాజాగా, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్, తన తదుపరి చిత్రం విజయ్ 69తో మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు.

విజయ్ 69 చిత్రం ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడు హెచ్‌ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  విజయ్ 69 చిత్రానికి మేకర్స్ ఎంపిక చేసుకున్న క్యాస్ట్ అంతా కలిసి ఒక పండగే. హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా, మలయాళ బ్యూటీ మమితా బైజు సెకండ్ హీరోయిన్‌గా కనిపిస్తుంది.

విలన్‌గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ తన కెరీర్‌లో రెండో తమిళ చిత్రం చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్, నటుడు నరైన్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి మరియు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తన కెరీర్‌లో చివరి చిత్రంగా విజయ్ 69 ని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న విజయ్, తన రాజకీయ జీవితానికి ఈ చిత్రం ఒక మంచి ప్రారంభంగా ఉండే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!