గన్ చూడాలనుకో తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్, ఆడు మగాడ్రా బుజ్జీ, జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుంది అలాంటిది పులినే వేటాడాలంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి.. ఈ డైలాగ్స్ వినగానే సినీలవర్స్ కి టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్స్క్రీన్లోనూ అతడు భారీ హిట్ అయ్యింది. అతడు మహేష్ కెరియర్లో ఓ మైల్ స్టోన్ మూవీ. నవ్వుతూ నవ్విస్తూ మాటలతో మాయచేసే త్రివిక్రమ్.. ఈ స్క్రిప్ట్‌ను మహేష్ బాబు కన్నా ముందు పవన్ కళ్యాణ్‌కు వినిపించాడు. కానీ త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే పవన్ నిద్రపోయాడట. దాంతో ఆయన కథ కంప్లీట్ చేయకుండానే వెళ్లిపోయాడు. అలా పవన్ చేయాల్సిన అతడు మహేష్‌బాబు కు చిక్కింది. ఆ తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేదిలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. ఈ ఇద్దరిదీ హిట్ కాంబినేషన్ అయ్యింది. ఈ కాంబినేషన్లో వచ్చిన మూడో ఫిల్మ్ అజ్ఞ్యాతవాసి మాత్రం డిజాస్టర్ అయ్యింది. అతడు మూవీ కోసం వీరి పరిచయం అంతగా వర్కవుట్ కాకపోయినా వీరిద్దరికీ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగతంగానే స్నేహబంధం వుంది.