Honey rose : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డితో తెలుగులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్.. నూతన దర్శకుడు ఆనందిని బాల దర్శకత్వంలో మహిళా ప్రధాన చిత్రం ‘రేచెల్’లో నటిస్తోంది. బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్ మరియు అబ్రిడ్ షైన్ ఈ సినిమాను నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ-నిర్మాత మరియు సహ-రచయిత, ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

‘రేచెల్’ టీజర్ హింస, రక్తపాతాలతో ఈ సినిమా నిండి ఉంటుందని తెలియచెబుతోంది. నటిగా హనీ రోజ్‌కి ఉన్న టాలెంట్ ను, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చెబుతోంది. ఆమె అద్భుతమైన నటన వల్ల టీజర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ చిత్రంలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధికా రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్నన్ మరముత్తం సహ నిర్మాత, ఛాయాగ్రహణం స్వరూప్ ఫిలిప్ మరియు సంగీతం ఇషాన్ ఛబ్రా అందించారు. మనోజ్ ఎడిటర్.

Leave a comment

error: Content is protected !!