Hombale Films : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన “సలార్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని ప్రకటించగా, ఇటీవల ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చాయని, దీంతో “సలార్ 2” ప్రాజెక్ట్ రద్దు అయిందనే వార్తలు షికారు చేశాయి.

ఈ వార్తలను ఖండించింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. సోషల్ మీడియాలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించే ఫోటోనుపోస్ట్ చేస్తూ “వీళ్ళు నవ్వకుండా ఉండలేరు” అని కామెంట్ చేసింది.  “సలార్ 2” చిత్రం ఖచ్చితంగా రాబోతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. హీరో, డైరెక్టర్ షూటింగ్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “సలార్ 2” హాలీవుడ్ సిరీస్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్” తరహాలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి” చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. మరోవైపు, మారుతి దర్శకత్వంలో “రాజాసాబ్” చిత్రంలోనూ, సందీప్ రెడ్డి వంగాతో “స్పిరిట్” చిత్రంలోనూ నటించనున్నారు.

 

Leave a comment

error: Content is protected !!