kanthara chapter 1 :  చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయం సాధించిన ‘కాంతార’ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి మరోసారి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్‌తో ముస్తాబు కానున్న ఈ చిత్రానికి ఒక ప్రముఖ హాలీవుడ్ VFX సంస్థతో చిత్ర బృందం చేతులు కలిపింది. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ వంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఈ ప్రీక్వెల్‌కు కూడా పనిచేస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన VFX పనులు యూఎస్, యూకేల్లో జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టి కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. కాంతార: చాప్టర్ 1 సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Leave a comment

error: Content is protected !!