నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చుసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ‘హాయ్ నాన్న’ సినిమాకే(నవ్వుతూ). శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజివల్స్ చాలా బావుంటాను. టీజర్ పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్ తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా… డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ భాద్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ప్రామిస్. అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్’’ అన్నారు.
రైటర్ కాశి మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. శౌర్యువ్ అద్భుతమైన కథ రాశారు. ఈ కథ విన్న తర్వాత స్పెల్ బౌండ్ అయిపోయాను. కొత్త రచయిత దర్శకులకు స్ఫూర్తిని ఇచ్చే హీరో నాని గారు. మంచి కథని ప్రోత్సహించే హీరో. ఆయనకు కథ నచ్చితే చాలు. మరో విషయం గురించి అలోచించరు. శౌర్యువ్ గారి ప్రతిభని డిసెంబర్ 7న చూస్తారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు. ఈ వేడుకలో దర్శకుడు శౌర్యువ్, నిర్మాత మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సతీష్ ఈవీవీ వ్యవహరిస్తున్నారు.
హాయ్ నాన్న డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM) డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వరుగుస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సతీష్ ఈవీవీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్