శ్రీలీల అనగానే డాన్సరే అనుకుంటారు.. కానీ నటిగా ప్రూవ్ చేసుకోవాలనుంది. భగవంత్ కేసరి అలాంటి సినిమానే అంటోంది క్రేజీ హీరోయిన్ శ్రీలీల. బాలయ్య, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సన్‌షైన్ స్క్రీన్ బ్యానర్‌లో అక్టోబర్ 19 న రిలీజ్ కాబోతున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల చిత్ర విశేషాలు విలేకరులతో పంచుకుంది.
భగవంత్ కేసరి నాకు బాగా నచ్చిన కథ. ప్రతీ సినిమాలో గ్లామర్ ఉంటుంది. కానీ నటన పరంగా అద్భుతంగా కనిపించే చిత్రాలు తక్కువుంటాయి. భగవంత్ కేసరిలో నా నటన చూస్తారన్నారు శ్రీలీల.
బాలయ్యతో పుష్ అప్స్ చేసే సీన్ ఉంది. ఆ సీన్‌లో చేయలేక పడిపోవాలి. ఆ సీన్ అయ్యాక నిజంగానే పుషప్స్ చేయడం రాదా అన్నారు బాలయ్య. డైరెక్టరే అలా చేయమన్నారని చెప్పాను. దాంతో నవ్వారు. బాలయ్యను మొదట చూసినపుడు భయంగా అనిపించింది. మాట్లాడగానే ఆ భయం పోయింది. బాలయ్యది నిజంగానే పసిమనసు. చాలా జోవియల్ గా ఉన్నారని చెప్పారు శ్రీలీల.
కాజల్ గారు బ్యూటీ విత్ బ్రెయిన్. అమేజింగ్ యాక్టర్. చాలా స్వీట్ హార్ట్. ఆమె టైమింగ్ అద్భుతం. చాలా మంచి సలహాలు ఇచ్చారు. చాలా విషయాలు నేర్పారు. కాజల్ గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. కాజల్ గారితో కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఆమె కామెడీ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు.
నా పాత్రలో కూడా చాలా వైవిధ్యం వుంటుంది. అనిల్ రావిపూడి గారు అద్భుతంగా తీశారు. నా రియల్ లైఫ్ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్ అయిపోయాను.నాకు మొదట అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. నిజానికి ఇది పెద్ద బాధ్యత గా భావిస్తున్నాను