వరుస విజయాలు సాధిస్తూ.. లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న క్రేజీ హీరోయిన్ నేహాశెట్టి. రూల్స్ రంజన్‌ సినిమాతో అక్టోబర్‌ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిరణ్‌ అబ్బవరం ఫిమేల్‌ లీడ్‌గా రత్నం కృష్ణ డైరెక్షన్‌లో స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ నిర్మించిన చిత్రమే రూల్స్‌ రంజన్‌. ఈ సినిమా విశేషాలను హీరోయిన్‌ నేహాశెట్టి పాత్రికేయులతో ముచ్చటించింది.

వరుస విజయాలు సాధిస్తున్నా.. ఇంకా సాధించాల్సంది చాలా ఉందనీతక్కువ టైమ్‌లో ఇంత పేరొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రూల్స్‌ రంజన్ సినిమాలో సన పాత్రపోషించాననీ.. డీజే టిల్లు లో రాధిక స్వార్ధ పూరితంగా ఉంటుంది. కానీ ఇందులో సన తిరుపతికి చెందిన హ్యాపీయెస్ట్ లేడీ పాత్రలా ఉంటుందన్నారు. కిరణ్ అబ్బవరం కూల్ యాక్టర్‌.. కామ్‌ గా ఉంటాడు. కానీ నేను పూర్తి వ్యతిరేకం.. సెట్స్ లోకి రాగానే అందరితో చాలా సరదాగా ఉంటాను. బెస్ట్ ఔట్ పుట్‌ ఇవ్వాలంటే వాతావరణం ఇలా సరదాగా ఉండాలి..కిరణ్ అబ్బవరంతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గ్రేట్‌ అన్నారు నేహాశెట్టి.

ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమ్రీష్‌ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.. సమ్మోహనుడా పాటకు డాన్స్‌ చేయడం నాకు చాలా పెద్ద టాస్క్‌ అయ్యింది. ఫైనల్‌గా ఈ పాట సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్ అయినందుకు సంతోషం ఉందన్నారు.

దర్శకుడు రత్నం కృష్ణ సినిమా ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్ ఉండటం వల్ల తనదైన నియమాలకు కట్టుబడి ఉంటారు. సినిమా ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ఔట్‌ పుట్‌ రాబట్టాలి అనే విషయంలో చాలా క్లారిటీతో ఉంటారన్నారు నేహాశెట్టి.

రూల్స్ రంజన్ నాకు హ్యాట్రిక్ అవుతుందా అని కాస్త భయపడుతున్నాను. కానీ నిస్సందేహంగా చెప్పగలను. మేమందరం చాలా చక్కగా పని చేసి, ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను రూపొందించాము. కానీ నాలో కాస్త టెన్షన్ ఉంది.

Leave a comment

error: Content is protected !!