రవితేజ గారి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు గాయత్రి భరధ్వాజ్. వంశీ డైరెక్షన్‌లో అభిషేక్‌ అగర్వాల్ నిర్మాణంలో రవితేజ,నూపుర్‌ సనన్, గాయత్రిభరధ్వాజ్‌ మెయిన్‌ లీడ్ చేస్తున్న మూవీ టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమా అక్టోబర్‌ 20 న ప్రపంచ వ్యాప‌్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో హీరోయిన్ గాయత్రి భరధ్వాజ్‌ ముచ్చటించారు.

2018 లో మిస్‌ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్‌ గెలిచిన గాయత్రి భరధ్వాజ్‌.. ఆ తర్వాత ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసానని, కోవిడ్ కారణంగా ఆలస్యమయ్యిందన్నారు. ఆ తర్వాత రెండు వెబ్‌ సిరీస్‌లో యాక్ట్ చేసానన్నారు. ఈ టైగర్‌ నాగేశ్వరరావులో నా పోర్షన్‌ కు 60 మందిని ఆడిషన్స్‌ చేసి.. నా గత వెబ్‌సిరీస్ లు చూసి నేనైతే యాప్ట్ అవుతానని వంశీ గారు తీసుకున్నారన్నారు. తన పాత్ర పోర్షన్‌ ను దాదాపు 3 గంటలపాటు నేరేషన్‌ ఇచ్చారట డైరెక్టర్‌ వంశీ. తన పాత్రలో చాలా ఎమోషన్ ఉందనీ.. నేరేషన్‌ టైమ్‌లోనే కన్నీళ్లొచ్చాయన్నారు.

ఈ సినిమా కోసం డైరెక్టర్ వంశీని బలంగా నమ్మాననీ.. హిందీ విశాల్‌ భరధ్వాజ్‌ గారి రెండు సినిమాల పేర్లు చెప్పి అవి చూడమన్నారన్నారు. 70 -80 లలో జరిగే ఈ కథ కోసం ఆ సినిమాల తాలూకూ రిఫరెన్స్ బాగా ఉపయోగపడిందన్నారు. తన పాత్ర రా అండ్ రస్టిక్‌గా ఎనర్జిటిక్‌ గా ఉంటుందన్నారు. సెట్స్‌ లో రవితేజగారు సరదాగా ఉంటూ.. యాక్టింగ్ టైమ్‌ లో చాలా హెల్ప్ చేసేవారన్నారు. రవితేజ డౌన్ టు ఎర్త్ పర్సన్.. ఆయనది పాజిటివ్ నేచర్ అన్నారు. రవితేజ తనను భరధ్వాజ్‌ అని పిలుస్తాడని చెప్పారు గాయత్రి భరధ్వాజ్‌.

డైరెక్టర్ వంశీ హిందీ బాగా మాట్లాడతారు సీన్ అర్ధం చేయిస్తారు. నాకు తెలుగు కోచ్ ఉన్నారన్నారు. స్టూవర్ట్‌పురం దొంగతనాల గురించి వంశీ చెప్పేవరకు తనకు తెలీదనీ.. ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా దొంగతనాలు చేసారు.. ఇందులో ఇందిరాగాంధీ ఎపిసోడ్‌ కూడా ఉంటుందనీ.. అది తెరపై చూడాల్సిందేనన్నారు. టాప్‌ క్లాస్‌ వీఎఫ్ఎక్స్‌ , రాజీ పడకుండా టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటెన్ చేసారు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అంటూ టైగర్‌ నాగేశ్వరరావు విశేషాలు పంచుకున్నారు హీరోయిన్ గాయత్రి భరధ్వాజ్.

ఇక తెలుగులో తన ఫేవరెట్ హీరో రామ్‌ చరణ్ అన్నారు గాయత్రి భరధ్వాజ్‌.

Leave a comment

error: Content is protected !!