Hero Suman : కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నగేష్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ “సముద్రుడు”. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్రను పోషించారు. సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలను ప్రతిబింబిస్తుంది. సముద్రమే వారి జీవనాధారం. ప్రభుత్వం సముద్రంలో చేపలు పట్టడంపై ఆంక్షలు విధించడంతో వారి జీవితాలు ఎలా మారతాయి? వారి పోరాటం ఏమిటి? అనే అంశాలను ఈ చిత్రం ప్రస్తావిస్తుంది.
ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, సుమన్, తదితర నటీనటులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
దర్శకుడు నగేష్ నారదాసి తనకు మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు అన్నారు దర్శకుడు వి. సముద్ర . దర్శకుడు నగేష్ నారదాసి అనేక శాఖలపై పట్టు సాధించిన వ్యక్తి. సుమన్ ఈ సినిమాను తన సొంత సినిమాగా భావించి పనిచేశారు అన్నారు టి. ప్రసన్నకుమార్. సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలపై ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు నగేష్ చాలా బాగా తీశాడు అన్నారు హీరో సుమన్ . దర్శకుడు నగేష్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ మరియు ఆర్టిస్ట్ సొంత సినిమాగా భావించి కష్టపడి పనిచేశారని రమాకాంత్ అన్నారు. సముద్రుడు సినిమా జాలర్ల జీవితాలను చూపించే డాక్యుమెంటరీ ఫిలిం లా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఒక మంచి సినిమా అని దర్శకుడు నగేష్ నారదాసి అభిప్రాయ పడ్డారు.