Meka Metha : టాలీవుడ్ అందగాడు, సూపర్ హిట్ సినిమాల్లో .. గుర్తుండిపోయే పాత్రలు చేసిన హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తున్నారు. ఆయన కొడుకు రోషన్ కూడా ‘పెళ్లి సందD’తో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మోహన్ లాల్ లీడ్ రోల్ లోని మలయాళం ప్రాజెక్ట్ వృషభ లో నటిస్తున్నాడు.

అసలు విషయానికొస్తే .. శ్రీకాంత్ కి మేధ అనే కూతురు కూడా ఉంది. ఆమె పబ్లిక్ లో ఎక్కువగా కనిపించదు. ఇటీవల ఈ సీనియర్ హీరో తన కుటుంబంతో తిరుమల తిరుపతి దేవాలయం సందర్శించారు. ప్రజలు సెల్ఫీల కోసం చుట్టుముట్టారు, వారిలో చాలా మందికి శ్రీకాంత్ సహకరించారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా.. ఆయన కూతురు మేధ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

పింక్ చీరలో ఆమె చాలా అందంగా కనిపించింది. తెలుగు అమ్మాయికి నిలువెత్తు రూపంగా నిలిచింది, హీరోయిన్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. తండ్రి శ్రీకాంత్, తల్లి ఊహ, తమ్ముడు రోషన్ లాగానే మేధ సినిమాల్లోకి వస్తుందో లేదో తెలియదు. సమయమే సమాధానం చెప్పాలి. మేధ ప్రస్తుతం కాలేజీలో చదువుతోంది.

Leave a comment

error: Content is protected !!