Hit 3 : నేచురల్ స్టార్ నానీ లేటెస్ట్ మూవీ ‘హిట్: ది థర్డ్‌ కేస్‌’. ఈ చిత్రం చిత్రీకరణ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలైన వెంటనే నానీ ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయడం విశేషం. ఈ సినిమాలో నాని హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రలో ఆయన ఎలా ఉండబోతుందో అనేది ప్రేక్షకులకు ఆసక్తిగా మారింది.

శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ తో కలిసి వాల్ పోస్టర్స్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ మొదటి రోజే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్‌ వర్గీస్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. హిట్ ఫ్రాంచైజీలో మరో సూపర్ హిట్ సినిమాగా ‘హిట్: ది థర్డ్‌ కేస్‌’ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!