Nani : నేచురల్ స్టార్ నానీ ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ఒక సినిమా పూర్తిగా ముగియక ముందే మరొక సినిమాను ప్రారంభించడం ఆయనకు అలవాటు. “సరిపోదా శనివారం” టైమ్ లోనే బలగం వేణు, దసరా శ్రీకాంత్ వినిపించిన కథలను విని, రెండింటికీ సిద్ధంగా ఉన్నారు. కానీ, రెండు పాత్రల్లో పోలికలు ఉండటం వల్ల ఒక కథను పక్కన పెట్టి, మరొకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.
“దసరా శ్రీకాంత్ చిత్రానికి దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ రాయడానికి రెండు నుండి మూడు నెలలు పడుతుంది. ఈ గ్యాప్ ను ఎందుకు వదిలేయాలి అని ఆలోచిస్తూ, ఆ సమయాన్ని మరొక సినిమా కోసం వాడాలని నాని భావించినట్లు తెలుస్తోంది. అలా చేయాలంటే ఒక బౌండ్ స్క్రిప్ట్ అవసరం. అదృష్టవశాత్తూ, నాని దగ్గర “హిట్ 3” చిత్రానికి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ చిత్రానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. “సైంధవ్” చిత్రం ఫలితం బాగా లేనందున , అతనికి కూడా ఇప్పటికిప్పుడు మరో అవకాశం రావడం కష్టం.
కానీ, నాని విషయంలో అలా కాదు. అందుకే, “హిట్ 3” చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లి, ఐదు నెలల్లో పూర్తి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్న నాని, వచ్చే నెల తిరిగి వచ్చిన తరువాత “దసరా” చిత్ర దర్శకుడి స్క్రిప్ట్ పురోగతిని చూసి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ లోగా, మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు నాని కోసం కథలు రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.