రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు సినీ నటుడు కృష్ణసాయి. సినీ ఫోటో జర్నలిస్ట్ ఆర్‌కే చౌదరికి ఆర్థిక సాయం చేశారు. ఆర్కే చౌదరి ఇంటికి వెళ్లి పరామర్శించిన హీరో కృష్ణసాయి.. బాధితుడి చికిత్స నిమిత్తం 15000 రూపాయల చెక్కును అందించారు. వృత్తిలో భాగంగా సినీ ఫోటో జర్నలిస్ట్ ఆర్‌కె చౌదరి ఓ ప్రెస్ మీట్ వద్ద ప్ర‌మాద‌వ‌శ‌త్తు కాలు జారిపడటం వల్ల వెన్నుముక‌కు బలమైన గాయం అయింది. వెన్నుముకలోని డిస్క్‌లు కంప్రెస్ కావ‌డంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆపరేషన్ ఖర్చు, నిత్యం ఖరీదైన ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి తక్షణ సాయంగా 15 వేల రూపాయలు అందించారు.

ఈ సంద‌ర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ… ”ఆర్‌కే చౌదరి సినీ ఫోటో జర్నలిస్టుగా సుధీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ప్రతి సినిమాకు తనవంతు బాధ్య‌తగా సినీ జర్నలిజంలో ఎన్నో సేవలు చేశారు. వారి కుటుంబ ప‌రిస్థితిని అర్థం చేసుకుని సినీ పెద్దలు, నటీనటులు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి, భ‌రోసా అందిచాలి” అని కోరారు.

విష‌యం తెలుసుకుని వ‌చ్చి ఆర్థిక సాయం అందించిన కృష్ణసాయిని ఆర్‌కే చౌదరి కుటుంబ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మరోసారి మానవత్వం చాటుకున్న కృష్ణసాయిని పలువురు సినీ జర్నలిస్టులు ఈ సంద‌ర్భంగా అభినందించారు. ‘సుందరాంగుడు’, ‘జ్యువెల్‌ థీఫ్‌’ సినిమాల్లో హీరోగా నటించాడు హీరో కృష్ణసాయి. ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ నిర్వహిస్తూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అపద్భాందవుడిలా ఆదుకుంటున్నారు.

Leave a comment

error: Content is protected !!