హలో ఎవరు ? ఈ మాట మనం ఎవరిని అంటాం.. అపరిచితులతో మాట్లాడేటపుడు ఈ పదం వాడతాం. ఈ మాటే ఓ హర్రర్‌ దారితీయొచ్చు. ఇదే లైన్‌ని విజువలైజ్ చేస్తూ ఓ సర్‌ప్రైజ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ను మన ముందుకు తీసుకురాబోతుంది శ్రీ శివసాయి ఫిల్మ్స్‌ బ్యానర్‌. హలో ఎవరు ? టైటిల్‌తో వెంటకరెడ్డి నంది దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు.
ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ లో విజయ్‌ పాపిరెడ్డి కటకం, సౌమ్యశ్రీ ఉంతకల్‌ జంటగా నటిస్తున్నారు.
క్రైమ్‌ హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ‘హలో ఎవరు ?’ రూపొందింది. ఆల్‌మోస్ట్ ఈ చిత్ర చిత్రీకరణ పూర్తయింది.
ఈ చిత్రం బాగా వచ్చిందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేసింది. ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. మే నెల‌లో ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్రయూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు జరుపుకుంటోంది.
న‌టీన‌టులు:
విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం, సౌమ్యశ్రీ ఉంత‌క‌ల్, వినాయ‌క్, గాదె స‌తీష్, యుగ దుర్గ న‌రేష్ , వేద‌శ్రీ మ‌ల్ల‌, చిత్రం శ్రీ‌ను, ఘ‌ర్షణ శ్రీ‌నివాస్, బ‌స్టాప్ కోటేశ్వర‌రావు, జ‌బ‌ర్దస్త్ రాజ‌మౌళి, గ‌బ్బర్ సింగ్ సాయి, గ‌బ్బర్ సింగ్ డూప్ రాజ‌శేఖ‌ర్ త‌దిరులు న‌టించారు.

Leave a comment

error: Content is protected !!