Harom Hara : ఈ నెల 31న విడుదల కావాల్సిన సుధీర్ బాబు నటించిన చిత్రం ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్‌ విశ్వనాథన్‌ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. 1989లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!