కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి చేరాడు.

ఆ మధ్య తన పుట్టిన రోజు సందర్బంగా ఒక స్వచ్ఛంద సంస్థకు తనవంతు సహాయం చేసిన హరీశ్ .. ఈ సారి వంద మంది పార్ట్ టైమ్ జర్నలిస్ట్ లకు టీఆర్ యస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నిత్యావరసర వస్తువుల్ని అందచేశారు.

Leave a comment

error: Content is protected !!