Hariharaveeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.

పవన్ కళ్యాణ్ తో పాటు అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రిష్ అండ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

తాజాగా విజయవాడలో ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ మొదలైంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఈ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!