HariharaVeeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్లూమ్యాట్ సెట్‌లో చిత్రీకరణ తిరిగి ప్రారంభం కాబోతోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ నెల మూడో వారం నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించనున్నారు.

ఈ షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ సెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఆయన పాత్రకు సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే చిత్ర వర్గాలు విడుదల తేదీని ప్రకటించనున్నారు. నిర్మాణానంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!