నీ మనసు నాకు తెలుసు‘ అంటూ తెలుగు తెరకు పరిచయమైన చెన్నై సోయగం త్రిష. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ ‘వర్షం’న్నే తనవైపు తిప్పుకున్న ‘మిస్ చెన్నై’ సుందరి త్రిష.చినుకులు కురిసిన ప్రతిసారి ‘ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వానా (త్రిష)’ అంటూ ప్రేక్షకులు మదిలో చినుకు రవ్వలలో త్రిష చూపిన తడిపొడి  అందాలను గుర్తుచేసుకునే హృదయాలను గిల్లే నీటి ముల్లులెన్నో. ‘ఐ లవ్ యూ’ అనే మూడు పదాలను ‘త్రి’ అనే ఒక్క అక్షరంలో దాచుకున్న రెండక్షరాల పేరు త్రిష. ‘అతడు’ ,బుజ్జిగాడు’ అయినా ‘అల్లరి బుల్లోడు’ అయినా ఈ ‘నాయిక’ జత కడితే ఆ ‘జోడి’ ‘పౌర్ణమి’ రోజు వెన్నెల్లా ‘ఆకాశమంతా’ వెలుగులా వెండితెరపై కనువిందు చేస్తుంది. ఈ రోజు త్రిష 38వ పుట్టిన రోజు.

త్రిష కృష్ణన్‌ 1983 మే 4న చెన్నైలో కృష్ణన్‌, ఉమ దంపతులకు జన్మించింది. త్రిష బ్యాచిలర్‌ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ)ను పూర్తి చేసి తనకు మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో పలు టెలివిజన్‌ కమర్షియల్‌ ప్రకటనలలో నటించింది. త్రిష 1999లో ‘మిస్‌ చెన్నై’ కిరీటం అందుకుంది. అలాగే 2001లో ‘మిస్‌ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్‌’ టైటిల్‌ సైతం సొంతం చేసుకుంది.

 త్రిష తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీ భాషలోనూ కథానాయికగా నటించింది. త్రిష ఎన్నోసూపర్ హిట్ సినిమాలలో నటించి అగ్ర కథానాయికగా రాణించింది. త్రిష చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు తరుణ్, ప్రభాస్, సిద్దార్ద్, ఎన్టీఆర్, విశాల్ వంటి హీరోల సరసన ఆడిపాడింది. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో తమిళ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టింది. 2018లో  త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘96′ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాలోని తన నటనకు ప్రముఖుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు లభించాయి. త్రిష మరెన్నో మంచి పాత్రలతో అభిమానులను అలరించాలని కోరుతూ బర్త్ డే విషెస్ అందిస్తుంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!