రష్మిక మందన్న తనదైన గ్లామర్ తో… బబ్లి గర్ల్ నేచర్ తో కూడిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ గల నటనతో ప్రేక్షకులను, అభిమానులను తన నుండి ‘ఇంకేం ఇంకేం కావలె’ అంటూ అలరిస్తున్న బ్యూటి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రిలో అటు దక్షిణాదిన ఇటు ఉత్తరాదిన సూపర్ క్రేజ్ తెచ్చుకుని వరుస సినిమా హిట్లతో టాప్ హీరోయిన్ గా ఎదిగి… ఇండియా వైడ్ గా పాపులారిటిని సొంతం చేసుకుని ‘నేషనల్ క్రష్ బ్యూటి’ గా పేరు తెచ్చుకుంది. అల్లరితో కూడిన నటన చేస్తూనే తన ముందున్న హీరోలను సైతం కూడా డామినేట్ చేయగల అభినయం ఈ కన్నడ భామ సొంతం. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

రష్మిక 1996 ఏప్రిల్ 5వ తేదీన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె ఎం. ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. రష్మిక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ స్థానం లభించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది.

కన్నడ సినీరంగ ప్రవేశం :

రష్మిక సినిమాల్లోకి రాకముందు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆప్ం ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది. అలా పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడిన తర్వాత 2016లో కన్నడ సినిమా  ‘కిరిక్ పార్టి’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది రష్మిక.

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు :

టాలీవుడ్ పరిశ్రమలోకి వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ సినిమాలో నాగషౌర్యతో జతకట్టి తనదైన లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి అభిమానులను సైతం సంపాదించుకుంది. ఆ సినిమా విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో చేసిన ‘గీత గోవిందం’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండను సైతం డామినేట్ చేయగల పాత్రలో అభినయించి  ఓవర్ నైట్ స్టార్ డమ్ తన సొంతం చేసుకుని టాలీవుడ్ లక్కి చార్మ్ గా ఎదిగింది రష్మిక. ఆ తర్వాత నాగార్జున, నానిలతో కలిసి ‘దేవదాస్’ సినిమాలో నానితో జతకట్టింది. ఈ సినిమాలో రష్మిక పోలిస్ పాత్రలో నటించింది. ఆ తర్వాత ఇంకోసారి విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో చేసిన ‘డియర్ కామ్రేడ్‌’లో ‘లిల్లి’ పాత్రలో చక్కని నటనను కనబరిచి ప్రశంసలను పొందింది రష్మిక మందన్న. తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది రష్మిక. గత ఏడాది లాక్ డౌన్ ముందు నితిన్‌తో కలిసి తన మొదటి తెలుగు సినిమా ‘ఛలో’ సినిమా డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వం  చేసిన ‘భీష్మ’ సినిమాలో నితిన్ కి జోడిగా నటించి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.

డబ్బింగ్ చిత్రాల పలకరింపు – కోలివుడ్ ఎంట్రి :

ఈ సంవత్సరం కన్నడలో ధృవ సర్జ హీరోగా నటించిన ‘పొగరు’ అనే డబ్బింగ్ సినిమాతో పలకరించింది రష్మిక. రీసెంట్‌గా  కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ అనే మరో  సినిమాతో పలకరించిన రష్మిక కి ఇదే తన మొదటి తమిళ్ సినిమా.

బాలీవుడ్ లోను క్రేజీ ప్రాజెక్ట్స్ :

‘టాప్ టక్కర్’ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. దీనితో పాటు అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలోను నటిస్తుంది రష్మిక.

గూగల్ గిఫ్ట్ :

తన అందచందాలతో క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసులను దోచుకున్న రష్మికకు గూగుల్ మరపురాని గుర్తింపును ఇచ్చింది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా రష్మిక ఎన్నికైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది కేవలం తెలుగు, కన్నడ భాషల్లో తప్ప మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయకుండానే అంతటి క్రేజ్ ను పొందిన ఘనత రష్మికకే సొంతం.

ప్రస్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ సినిమాలోను నటిస్తుంది రష్మిక. ఇలా మరెన్నో సూపర్ సక్సెస్‌ఫుల్ సినిమాలతో అభిమానులను ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ రష్మిక మందన్నకు బర్త్ డే విషెస్ తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!