Shopping Cart 0 items - $0.00 0

కమల్ హాసన్ ‘గురు’ చిత్రానికి 40 ఏళ్లు

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన వైవిధ్యమైన యాక్షన్ చిత్రం ‘గురు’. సుజాతా ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రకాశ్ ఆర్.సి నిర్మించిన ఈ సినిమాకి మలయాళ యాక్షన్ డైరెక్టర్ ఐ.వి.శశి దర్శకుడు. 1980 లో విడుదలైన ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, ప్రభాకరరెడ్డి, వై.జి.మహేంద్రన్, యస్వీ రామదాసు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంచలనం రేపాయి.

చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అశోక్ తన తల్లి పేరుమీద ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించి.. గురు పేరుతో  భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారతాడు. ఆ క్రమంలో ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ఒక గ్యాంగ్ స్టర్ కూతురు. ఆ గ్యాంగ్ స్టర్ తన తల్లిదండ్రుల్ని చంపినవాడని గ్రహించిన అశోక్ .. చివరికి అతడిమీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా జుగ్ను అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ వెర్షన్. అప్పట్లో గురు చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!