Gunturukaaram trailer : ఎన్నో ఎదురుచూపుల మధ్య మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని యాక్షన్ మూవీ.. గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి థియేటర్స్ ను మోతెక్కించబోతున్న ఈ సినిమా ట్రైలర్ టేటెస్ట్ గా వచ్చేసింది. మహేశ్ బాబుని పక్కా మాస్ అవతార్ లో చూపించి…. అభిమానుల్ని మేస్మరేజ్ చేశాడు త్రివిక్రమ్.  ట్రైలర్ ప్రారంభంలో త్రివిక్రమ్ గళం రమ్యకృష్ణ పాత్రను ఎందుకు మొదటి బిడ్డను అనాథగా వదిలేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తుంది.

 

ఆ తర్వాత మహేష్ బాబు గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తూ..  ఎంజాయ్ చేస్తున్నారా అనే డైలాగ్‌తో జనంచేత విజిల్స్ వేయిస్తూ.. ఉత్సాహాన్ని రేకెత్తిస్తాడు. ట్రైలర్ అంతటా, మహేష్ బాబు డైలాగ్‌లు, అతడి హావభావాలు ఆకట్టుకుంటాయి. తరచుగా వివిధ దృశ్యాలలో బీడీ తాగుతూ కనిపిస్తాడు.

శ్రీలీల, మీనాక్షి చౌదరి ట్రైలర్‌కు గ్లామర్ టచ్ ఇస్తారు. ప్రకాష్ రాజ్ ప్రతినా యకుడిగా కనిపిస్తారు. ఒక కొడుకు తన బాల్యంలో విడిపోయిన తల్లిని తిరిగి కలుసుకోవడానికి చేసిన ప్రయాణం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొడుకును ఎంతో కాలంగా కోల్పోయిన తల్లి మధ్య ఉన్న భావోద్వేగ బంధం గుంటూరు కారం అని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. మహేశ్ బాబు తల్లిగా రమ్యకృష్ణ కనిపించింది.

Leave a comment

error: Content is protected !!