బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ..  ఏ పాత్ర పోషించినా.. అందులో పరకాయ ప్రవేశం చేస్తారని వేరే చెప్పాలా? సెవెంటీ ప్లస్ ఏజ్ లో కూడా అమితాబ్ జీ.. ఎంతో ఎనర్జిటిక్ గా పాత్రలో ఎంతో లీనమై… అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటారు.  తాజాగా ఆయన పాత్రలో జీవించిన మరో  వైవిధ్యమైన చిత్రం ‘గులాబో సితాబో’. ఇందులో అమితాబ్ తో పాటు .. ఆయుష్మాన్ ఖురానా కూడా మరో ముఖ్యమైన పాత్ర పోషించాడు.  షూజిత్ సర్కార్ దర్శకత్వంలో .. తెరకెక్కిన ఈ సినిమాలో  ప్రధాన పాత్ర పోషించిన  అమితాబ్ బచ్చన్ వృద్ధుడి పాత్ర గెటప్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పాత్ర నిమిత్తం వదులు చొక్కా, తలచుట్టూ వస్త్రం, నెరిసిన గుబురు గడ్డం, కళ్లజోడు ధరించిన అమితాబ్ బచ్చన్ ఈ లుక్ కోసం రోజూ దాదాపు 3గంటలపాటు మేకప్ వేసుకొనేవారట. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సిన చిత్రం. కరోనా లాక్ డౌన్ కారణంగా..  విడుదల వాయిదా పడి.. ఇప్పుడు ఏకంగా అమెజాన్ ప్రైమ్ లోనే జూన్ 12 న విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను  విడుదల చేసింది చిత్ర బృందం.

దాదాపు 2నిమిషాల 30 సెకన్లు ప్రదర్శనా సమయం కలిగి ఉన్న గులాబో సితాబో ట్రైలర్ ..అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపాన్ని ఎలివేట్ చేసింది. వృద్ధుడి గెటప్ లో వైరైటీ లుక్ లో కనిపించిన బిగ్ బీ..  తనదైన శైలిలో డైలాగ్స్ పేల్చుతూ..  అదరగొట్టేశారు. ఆయనతో  పోటీ పడుతూ ..  యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా కూడా అద్భుతంగా  నటించి సత్తా చాటుకున్నాడు.  ఒక ఇంటి గురించి.. అందులో అద్దెకుండే విషయం గురించి .. వాదులాడుకొనే పాత్రలో అమితాబ్, ఆయుష్మాన్ కామెడీ పండించారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. 

ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి. 

https://www.youtube.com/watch?v=o0qeQ_yHqtA&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!