పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. సినిమా పాటలను ప్రదర్శించే తరుణంలో చాలా మంది కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. వారందరిలోను వైట్ & వైట్ డ్రెస్ లో చేతిలో గిటార్ పట్టుకుని ఉన్న అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా… తను ఎవరు అంటూ సోషల్ మీడియాలో ‘హూ ఈజ్ దట్ గిటార్ గర్ల్’ అంటూ ట్రెండింగ్ లోను నిల్చింది.

 

తను ఎవరో కాదు ప్రముఖ సింగర్ పి. సుశీల గారి మనవరాలు. తన పేరు శుభశ్రీ. తను తమన్ 2020 బిగ్గెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ అల… వైకుంఠపురంలోని సినిమాలో సామజవరగమన, రాములో రాముల పాటలకి గిటారిస్ట్ గా చేశారు. తను డ్రమ్స్  వాయిధ్యాలకు పెట్టింది పేరైన శివమణి బృందంలోను అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇది ఆ గిటార్ గర్ల్ శుభశ్రీ వెనుక ఉన్న కథ.

Leave a comment

error: Content is protected !!