27ఏళ్ల క్రితం వినోద్‌బాల ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Artists Association of Telugu Telivision) AATT ఏర్పడింది. అప్పటి నుంచి ఐకమత్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. 2025కు గాను తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ఎన్నికలకు రంగం సిద్దమయింది. . పోటీలో ఉన్న ప్యానల్ సభ్యులు గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికలు జనవర 31న జరగనున్నాయి. ఈ సందర్భంగా GS హరి ప్యానల్ ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
GS హరి ప్యానల్ మేనిఫెస్టోః–
1. ఒక్కో తెలుగు సీరియల్‌లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి
2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం
3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్‌లు
4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు
5. నాగబాబు గారి సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి
6. 3. స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.
7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు
8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం
9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.
10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాము
11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం
12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం