దర్శక రత్న దాసరి నారాయణరావు. దర్శక దిగ్గజం.. టాలీవుడ్ పెద్ద దిక్కు. దర్శకుడు, నిర్మాత, కథ మాటలు పాటల రచయితగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. పర్ఫెక్షన్ విషయంలో మహా మొండిగా ఉంటారట.
అది స్వర్గం నరకం చిత్ర షూటింగ్ టైమ్. ఈ సినిమాతోనే మోహన్‌బాబు పూర్తిస్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక షాట్ వుంటుంది. మోహన్‌బాబు మెట్లు
దిగుతూ హీరోయిన్‌తో డైలాగ్ చెప్తూ సిగరెట్ వెలిగించాలి. చాలా చిన్న సీన్. అయితే మోహన్‌బాబు మెట్లు దిగుతూ డైలాగ్ చెప్తే సిగరెట్ వెలిగించడం మర్చిపోయేవారు. సిగరెట్ వెలిగిస్తే డైలాగ్ చెప్పడం మర్చిపోయేవారు. ఈ చిన్న సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం కంటిన్యూస్ గా షూట్ చేస్తూనే ఉన్నారట దాసరి. ఉదయం 9.15 ని.లకు మొదలుపెడితే రాత్రి 11.20 ని.ల వరకు షూట్ చేస్తూనే ఉన్నారట దాసరి. అంటే 14 గంటలపాటు ఒక్క సీన్ ను షూట్ చేస్తూనే వున్నారట. త్వరగా అయిపోవాల్సిన షూట్ 14 గంటలు పట్టిందంటే మామూలు విషయం కాదు. ఇందుకు మెయిన్ రీజన్ దాసరి పర్ఫెక్షన్ కోసం పడే ఆరాటమే. ఈ పర్ఫెక్షనే దాసరిని తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.