కాలగర్భంలో కలిసిపోయిన ఎంతోమంది చరిత్రకారులు, గొప్పవారు మనతో పుస్తకాల ద్వారా మాట్లాడుతారు. అలాంటి గొప్ప అనుభవాలెన్నింటినో అందించే వేదిక గ్రంథాలయం. కాకమ్మ కథలు, కాల్పనిక అనుభూతులు, కఠిన సత్యాలు, కనుమరుగైన వాస్తవాలు ఇలా ఎన్నింటినో తెలుసుకునే అవకాశం కల్పించేది గ్రంథాలయం. ఇప్పుడు ఇదే గ్రంథాలయం ఓ సినిమాకు కథా వస్తువైంది. ఈ గ్రంథాలయం ఏం ఆవిష్కరిస్తుంది.. ఎలాంటి కథను చూపిస్తుందనేది రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ రివీల్ చేసింది. ఓ గ్రంథం తాలూకూ మిస్టరీని ప్రథానాంశంగా తీసుకుని కథకుడు దర్శకుడు సాయి శివన్ జంపాన రాసిన డైలాగ్స్, టేకింగ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపేలా చేసాయని చెప్పొచ్చు. సామల భాస్కర్ విజువల్స్ టెర్రిఫిక్. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్‌ని థ్రిల్ చేస్తుంది. వైష్ణవీ శ్రీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఆడియెన్స్‌కి సరికొత్త అనుభూతిని మిగిల్చుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ గ్రంథాలయం ట్రైలర్ వైరల్ అవుతూ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తుంది.
అటు ఫైట్స్ సీక్వెన్స్ తో పాటు, ప్రస్తుతం ఈ ట్రైలర్ డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో వైరల్ గా మారింది. ఈ సినిమా రీలిజ్ కి ముందే ట్రేడు వర్గాల్లో మంచి బిజినెస్ జరుగుతుంది. అన్ని పనులని పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చ్ 3న రిలీజ్ కి సిద్దమవుతుంది.