హ్యాండ్సమ్ ఫేస్..  పవర్ ఫుల్ ఐస్.. మ్యాన్లీ లుక్స్ .. మంచి హైటు.. అందుకు తగ్గ వెయిటూ.. సిక్స్ ప్యాక్ బాడీ.. వెరసి గోపీచంద్. యాక్షన్ సీక్వెన్సెస్ చేయడంలో మాస్టర్ అయిన అతడు యాక్టింగ్ లో కూడా హీ మేనే .  తండ్రి టీ. కృష్ణ ఒకప్పుడు టాలీవుడ్ లో గొప్ప దర్శకుల్లో ఒకరు. ఆయన  సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆ హీరో .. తనకుంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకొని .. సక్సెస్ కోసం నిరంతరం తపిస్తూనే ఉన్నాడు.

గోపీచంద్‌ ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం  చేశారు . ఆ తర్వాత ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి మంచి  విజయాల్ని అందుకొన్నారు. ‘యజ్ఞం’, ‘రణం’ చిత్రాలతో మళ్లీ కథానాయకుడిగా ప్రేక్షకుల్ని అలరించారు. ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతోపాటు, గోపీచంద్‌కి మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో వినోదాత్మక కథల్లోనూ మెప్పించగలనని కొన్ని చిత్రాలతో నిరూపించారు. ‘ఒక్కడున్నాడు’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘గోలిమార్‌’, ‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్‌’ తదితర చిత్రాలు గోపీచంద్‌కి మంచి పేరే పేచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘సీటీమార్‌’లో నటిస్తున్నాడు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇందులో గోపీ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు.  నేడు  గోపీచంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ యాక్షన్ డైనమైట్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే గోపీచంద్

 

Leave a comment

error: Content is protected !!