2000 లో విడుదలైన ‘గ్లాడియేటర్’ హాలీవుడ్ సినిమా ఆనాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రోమన్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ఒక గ్లాడియేటర్ పోరాటం, ప్రతీకారం నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో పాల్ మాస్కల్ హీరోగా నటించగా.. అకాడమీ అవార్డులను అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఇప్పుడు, 24 సంవత్సరాల తర్వాత, గ్లాడియేటర్ సిరీస్ కు కొనసాగింపుగా గ్లాడియేటర్ 2 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆ మధ్య విడుదలైన ట్రైలర్.. అంచనాలను మరింత పెంచింది.
గ్లాడియేటర్ 2 సినిమా కథ, మార్కస్ ఆరేలియస్ అనే మాజీ రోమన్ చక్రవర్తి మనవడు లూసియస్ కథతో ముందుకు సాగుతుంది. మొదటి భాగంలో చిన్న పిల్లవాడిగా కనిపించిన లూసియస్, ఇప్పుడు పెద్దవాడై, తన తాత మరణానికి కారణమైనవారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
లూసియస్ ఉత్తర ఆఫ్రికా ప్రాంతమైన నుమిడియాలో నివసిస్తుంటాడు. అక్కడ అతను తన గతం నుంచి దూరంగా ఉంటూ, ఒక సాధారణ జీవితం గడుపు తుంటాడు. కానీ, విధి అతన్ని తిరిగి రోమ్‌కు తీసుకువస్తుంది. రోమ్‌లో లూసియస్ తన కుటుంబం గురించి తెలుసుకుని, తన గతాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు.
గ్లాడియేటర్ 2 సినిమాను ఈ ఏడాది నవంబర్ 15 న ఈ చిత్రం ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం , భాషలలో విడుదల కానుంది. తెలుగుతో పాటు, కన్నడ, మలయాళం, తమిళం లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లో 4DX & IMAXలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.