యాక్షన్‌ థ్రిల్లర్స్ చేయడంలో కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు ముందంజలో ఉంది. ఆల్కహాల్‌ పానీ పూరీ తిన్నా.. ఏకే 47 గన్స్‌తో వచ్చిన విలన్స్‌కి కంటి చూపుతోనే బెదిరించినా. కన్నడ సూపర్‌స్టార్‌ శివన్న స్టైలే వేరు.  దే కాల్‌మీ ఓజీ.. అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ మాఫియా గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టించే పర్‌ఫార్మెన్స్‌తో ఘోస్ట్‌గా  థ్రిల్ చేస్తున్నాడు. శివన్న లేటెస్ట్ ఫిల్మ్‌ ఘోస్ట్ నుంచి బిగ్‌ డాడీ టీజర్‌ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
శివన్న స్క్రీన్‌ ప్రజెన్స్‌ టెర్రిఫిక్‌ గా ఉంది. బిగ్‌ డాడీ టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సూపర్బ్‌ స్కోర్ చేసింది. అర్జున్‌ జన్య ఇచ్చిన ఆర్‌ఆర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మహేష్ సింహా సినిమాటోగ్రఫీ యాక్షన్‌ ప్రియుల్ని థ్రిల్ చేస్తుంది. బిగ్‌ డాడీ అంటూ ఓ వార్‌ ట్యాంకర్‌ ని చూపిస్తాడు.  యాక్షన్‌ ఫిల్మ్‌లో ఉండాల్సిన హైప్‌ ఫైర్‌ ఈ బిగ్‌డాడీ టీజర్‌ తెచ్చేసింది.
ఘోస్ట్  చిత్రానికి దర్శకుడు శ్రీని.. పొలిటికల్ లీడర్‌ అండ్ ప్రొడ్యూసర్‌ సందేశ్‌ నాగరాజ్‌ హైటెక్నికల్ వేల్యూస్‌ తో ఈ చిత్రాన్ని సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మించారు.
అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. కన్నడ,తెలుగు, తమిళ్ , మళయాళం, హిందీ భాషల్లో ఈ దసరాకి రిలీజ్ చేయబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!