హత్య జరిగితే, పోలీసులు నిందితులను పట్టుకోవడం న్యాయవ్యవస్థ శిక్ష విధించడం ఇది సరైన పద్దతి. కానీ వ్యవస్థలో లోపాలు, లోపాయికారితనపు వ్యక్తులు ఉండటం వలన నిరపరాధులు శిక్షించబడుతున్నారు. అసలు నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా.. లేడీస్ హాస్టల్లో జరిగిన హత్య బ్యాక్‌డ్రాప్‌తో… నిరపరాధిని పట్టుకుని తప్పు చేసినట్టు ఒప్పుకోమని చెప్పే గద్దల్లాంటి కొందరు పెద్దలకు అమ్ముడుపోయిన కొందరు అవినీతి పోలీస్‌లు టార్చర్ చేయడం… నిరపరాధి వీరోచిత పోరాటంతో తను బయటపడటంతో పాటు నిజాన్ని , అసలు బండారాన్ని బయటపెట్టే కథాంశం తో వస్తున్న సినిమా “గీతసాక్షిగా “. ఈ మూవీ ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ చేసారు.
ఆదర్శ్, చిత్ర శుక్లా మెయిన్‌లీడ్ చేస్తున్న ఈ సినిమాలో చరిష్మా కీరోల్ పోషించింది. ఆంథోని మట్టిపల్లి డైరెక్షన్లో చేతన్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
యథార్ధ ఘటనల ఆధారంగా ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన ‘గీత సాక్షిగా’ పోస్టర్, టీజర్లతో ఆకట్టుకుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. మార్చి 22 న తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
వెంకట్ హనుమ నారిశెట్టి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కిషోర్ మద్దాలి ఎడిటర్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.